ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం 1వ వార్డు కట్టుబడిపాలెంలో ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.