కోళ్లపర్రు పరిధిలో నేడు పవర్ కట్
W.G: కోళ్లపర్రు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని కొల్లేరు ఫీడర్లో వార్షిక మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. గంటలరాయుడుపేట, కుందుగూడెం, పెదకాపవరం, తుమ్మకోడు పరిధిలోని ఆక్వా చెరువులకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. వినియోగదారులు, ఆక్వా రైతులు సహకరించాలని అధికారులు కోరారు.