లేబర్ కోడ్లను రద్దు చేయాలి: CITU

లేబర్ కోడ్లను రద్దు చేయాలి: CITU

WG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ ఇరగవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మునిస్వామి మాట్లాడుతూ.. కేంద్రం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను పూర్తిగా మార్చివేసిందని, ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.