VIDEO: తిర్యాణిలో ఉగ్రరూపం దాల్చిన వాగు

ASF: జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్ వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. దీంతో మాణిక్యపూర్, రొంపల్లి, మంగి, గుండాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.