కొయ్యూరు వ్యవసాయ అధికారిగా బీ.రాజ్ కుమార్

కొయ్యూరు వ్యవసాయ అధికారిగా బీ.రాజ్ కుమార్

ASR: కొయ్యూరు మండల వ్యవసాయ అధికారిగా బీ.రాజ్ కుమార్ బుధవారం నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఏవోగా పనిచేసిన ఐ.భాను ప్రియాంక పాడేరులోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో వ్యవసాయ అధికారిగా డిప్యుటేషన్‌పై వెళ్తున్నారు. ఈమేరకు అక్కడ టెక్నికల్ విభాగంలో ఏవోగా పనిచేస్తున్న బీ.రాజ్ కుమార్‌ను కొయ్యూరు ఏవోగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.