ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన విద్యార్థులు
SRCL: తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నామని తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్‌కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1వ తరగతుల నుంచి 5వ తరగతి వరకు సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.