VIDEO: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. RDT సంస్థకు FCRA రెన్యువల్ చేయాలని నిరసనకారులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీటీకి విదేశీ నిధులు ఆపొద్దంటూ నినాదాలు చేశారు.