వికారాబాద్ జిల్లాలో జనాభా గణనకు సన్నద్ధం

వికారాబాద్ జిల్లాలో జనాభా గణనకు సన్నద్ధం

వికారాబాద్ జిల్లాలో జనాభా లెక్కలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో జనాభా లెక్కించడానికి రెండు విడతలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18 నుంచి అధికారులకు శిక్షణ ఇచ్చి, మే 11 నుంచి జూన్ 9 వరకు కుటుంబాల సర్వేను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండో విడత 2027లో కుటుంబాల్లోని జనాభాను లెక్కగట్టనున్నారు.