రేపటి నుంచి ఇంటర్ తరగతులు
ASR: అల్లూరి, పోలవరం జిల్లాల్లో జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ 1 నుంచి సెకండ్ ఇంటర్ తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు అధికారి భీమశంకరరావు మంగళవారం తెలిపారు. ఈ జిల్లాల్లో 74 కళాశాలల్లో 5500 మంది విద్యార్థులు ఉన్నారని, ఏప్రిల్ 23వ తేదీ వరకు తరగతులు జరుగుతాయన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే వారు టెన్త్ పరీక్షల హల్ టికెట్‌తో రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చన్నారు.