టీవీలు పగలగొట్టుకున్న పాక్ ఫ్యాన్స్..!
T20 WCలో వెస్టిండీస్‌పై టీమిండియా గెలిచి సెమీస్ చేరుకోవడాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జట్టు గెలుపును తట్టుకోలేక తమ ప్రతాపన్ని టీవీలపై చూపిస్తున్నారు. భారత్‌పై కోపంతో ఓ పాక్ అభిమాని తన LED టీవీని పగలగొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన భారత అభిమానులు 'వీళ్లకి ఎందుకు ఇంత కడుపు మంట?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.