ఇంధన కొరత లేదు.. పుకార్లు నమ్మవద్దు: ఎస్పీ
VKB: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని స్పష్టం చేశారు. అనవసరంగా బంకుల వద్ద బారులు తీరి ట్రాఫిక్ సమస్యలు సృష్టించవద్దని సూచించారు.