గిద్దలూరులో రేపు పవర్ కట్
ప్రకాశం: గిద్దలూరులో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శేషగిరిరావు తెలిపారు. అంబవరం ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా మండలంలోని ముండ్లపాడు, బురుజుపల్లి, కంచిపల్లి, కృష్ణంశెట్టి పల్లె సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.