డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్
MHBD: జిల్లాను డ్రగ్స్ రహితంగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని కళాశాలల్లో అవగాహన కల్పించాని సూచించారు.