ఒక యజ్ఞంలా పూడికతీత పనులు నిర్వహించాలి: MLA
VZM: బొబ్బిలి MLA బేబినాయన శుక్రవారం మండల పరిషత్ అధికారులతో 'జలధార- జలహారతిపై' సమీక్షించారు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలా చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్దంగా పని చేయాలని, వాటి అభివృద్ధితో రైతులకు సాగునీరు అందుతుందన్నారు.