బాబు జగ్జీవన్ రామ్ జయంతిలో పాల్గొన్న కలెక్టర్
MNCL: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ఉప ప్రధానిగా, వివిధ పదవులలో పని చేసిన ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.