VIDEO: 105 కిలోల గుండు రాయిని భుజంపై ఎత్తిన జ్ఞానేశ్వర్

VIDEO: 105 కిలోల గుండు రాయిని భుజంపై ఎత్తిన జ్ఞానేశ్వర్

SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో ఓ యువకుడు ఇవాళ క్వింటాలు బరువు గల గుండు రాయిని అలవోకగా భుజంపై ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గ్రామానికి చెందిన సాతిని జ్ఞానేశ్వర్ హోలీ సంబరాల్లో 105 కిలోల బరువు ఉన్న గుండు రాయిని చాకచక్యంతో భుజంపై ఎత్తి హనుమాన్ మందిరం చుట్టూ 2 ప్రదక్షిణ చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. ఆయనకు గ్రామస్తులు అభినందించారు.