VIDEO: నేరడిగొండలో విజయోత్సవ సంబరాలు
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ జాదవ్ గెలుపు పట్ల నేరడిగొండ మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలను శుక్రవారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు టపాసులు పేల్చి నృత్యం చేస్తూ సందడి చేశారు. రానున్న స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.