అమరజీవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

అమరజీవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

PLD: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చుక్క రక్తం చిందించకుండా గాంధీ చూపిన అహింస మార్గంలో ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.