ఓయూలో ప్రత్యేక పూజలు.. ఎందుకంటే..?

హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి దేవాలయంలో శనివారం మధ్యాహ్నం విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.