'అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి'
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పరిధిలో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలను సెస్ పాలకవర్గంతో పాటు అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర యూనిటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని సెస్ పాలకవర్గంకు వినతి పత్రం అందజేశారు.