సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం.!
MDK: రెండోవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మెదక్ మండలం మంబోజి పల్లిలో గౌండ్ల యాదమ్మ అంజగౌడ్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. వీధి వీధినా తిరుగుతూ తమకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో బట్టలు కుడుతూ, ఐరన్ చేస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.