తాగునీటీ సమస్య తలెత్తకుండా చూడాలి: ఎమ్మెల్యే

తాగునీటీ సమస్య తలెత్తకుండా చూడాలి: ఎమ్మెల్యే

CTR: నగరి మున్సిపాలిటీలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా సరఫరా అయ్యే పైప్‌లైన్ లీకైనట్లు వచ్చిన కథనాల గురించి ఆరా తీశారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు.