పెళ్లకూరులో గర్భవతులకు అవగాహన సదస్సు

పెళ్లకూరులో గర్భవతులకు అవగాహన సదస్సు

TPT: పెళ్లకూరు మండలం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పీఎంఎస్ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భవతులు ప్రతి నెల రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్ సుజాత తెలియజేశారు. పోషకాహారం తీసుకోవాలని లేకపోతే తల్లికి బిడ్డకి ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఏఎన్ఎమ్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.