వినాయక ఉత్సవ కమిటీలకు పోలీసు వారి హెచ్చరికలు

KDP: మైదుకూరు మండలం, మున్సిపాలిటీలోని గణేష్ ఉత్సవ కమిటీలకు మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సీఐ రమణారెడ్డి ఎస్సై చిరంజీవి పాల్గొని మాట్లాడుతూ.. పండుగను కుల మతాలకతీతంగా శాంతిభద్రతల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని, వినాయక విగ్రహాల పెట్టడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.