VIDEO: ఆక్రమణలను పరిశీలించిన కమిషనర్
పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని కమిషనర్ నందన్ శనివారం పర్యవేక్షించారు. ఈ మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో పర్యటించారు. నిర్దేశించిన మార్జిన్ దాటి డ్రైన్ కాలువలు, రోడ్లపై నిర్మించిన కట్టడాలను పూర్తిస్థాయిలో తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.