డయాలసిస్ రోగుల ప్రాణాలతో చెలగాటం!

డయాలసిస్ రోగుల ప్రాణాలతో చెలగాటం!

నెల్లూరు జిల్లా పొదలకూరు సీహెచ్‌సీలో విద్యుత్ కోతతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి 2 గంటల వరకు కరెంట్ నిలిచిపోవడంతో యంత్రాలు ఆగిపోవడంతో చికిత్స మధ్యలో ఉన్న రోగులు ఆందోళన చెందారు. సీఎస్సార్ నిధులతో జనరేటర్ తెచ్చినా, నెలలుగా దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.