మంత్రి ఇలాకాలో వైద్యం కరువు

మంత్రి ఇలాకాలో వైద్యం కరువు

SRD: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటలైనా వైద్యులు రాకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.