బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.