రోడ్డు నిబంధనలు పాటిస్తేనే రక్షణ: సీపీ
KNR: ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. 'అరైవ్-అలైవ్' మూడవ దశలో భాగంగా ఆటో, రాపిడో డ్రైవర్లకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 200 మంది మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరూ 'డిఫెన్సివ్ డ్రైవింగ్' అలవర్చుకోవాలని సూచించారు.