కారుని ఢీకొట్టిన లారీ ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు
WGL: వరంగల్ నగరంలోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్‌కు వెళ్లే మార్గంలో మంగళవారం కారు–లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారు కక్కిరాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తించారు. లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.