సిగ్నల్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన జీపీ కార్యదర్శి

MLG: ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలో గురువారం ఫోన్ సిగ్నల్ సమస్యతో పంచాయతీ కార్యదర్శి సతీశ్ కుమార్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫొటోలను అప్లోడ్ చేయడానికి గ్రామంలో సరైన సిగ్నల్ లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు శుక్రవారం తెలిపారు. గ్రామంలో 8 ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ ఫొటోలను సకాలంలో అప్లోడ్ చేయాలని ఆయన తెలిపారు.