వాహక వ్యాధులపై అవగాహన ర్యాలీ

వాహక వ్యాధులపై అవగాహన ర్యాలీ

MDCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోడుప్పల్ సర్కిల్‌లో అంబేద్కర్ నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీల్లో వాహక వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శైలజ, AMOH చైతన్య కుమార్ పాల్గొని డెంగ్యూ, మలేరియా నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణ కోసం ఫాగింగ్, ఆయిల్ బాల్స్, స్ప్రే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.