భావే మహినా ఆదివాసులకు పవిత్రమైనది

ADB: ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో భావే మహినా (మాసం)ను నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని కల్లూరుగూడ గ్రామంలో భావే మహినా (మాసం) సందర్భంగా ఆష్టెకర్ ఆత్రం వారి పూజ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.