నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

NRPT: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సంగం బండ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో మాగనూర్ మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. నేరేడుగం, వర్కూర్, వాడ్వాట్, అడవి సత్యరం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆయా గ్రామాల బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.