దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

మార్కాపురం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్ వంటి సాంప్రదాయ క్రీడలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. మహిళలు అధికంగా పాల్గొని సంబరాలకు శోభ చేకూర్చారు. విజేతలకు ఆలయ కమిటీ బహుమతులు అందజేసింది.