ప్రజా దర్బార్‌తో ప్రజల సమస్యలకు పరిష్కారం
అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కా రూపానంద రెడ్డి ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించి, తక్షణ పరిష్కారంపై దృష్టి సారించారు. వెంటనే పరిష్కరించగలిగే సమస్యలకు సంబంధించి అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు.