అధునాతన రోగ నిర్ధారణ వ్యవస్థల ప్రారంభం
సత్యసాయి: శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (SSSIHMS)లో రోగుల సంరక్షణను మెరుగుపరిచేందుకు మూడు కీలక వ్యవస్థలను ప్రారంభించారు. అధునాతన రోబోటిక్ పరికరాలతో కూడిన రూ.53.47 లక్షల పునరావాస సూట్, అధునాతన రోగ నిర్ధారణ వ్యవస్థలను ప్రారంభించారు. టెక్నాలజీతో కూడిన సేవలు అందించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.