ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

WGL: గీసుకొండ మండలం ఉకల్ హవేలీ గ్రామంలో ఇవాళ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనా సమేత కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయాన్నే అర్చకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను వాడవాడలా ఊరేగించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.