గొల్లప్రోలులో పారిశుధ్యం కార్మికులు బిక్షాటన
కాకినాడ: గొల్లప్రోలు నగర పంచాయతీలో శానిటేషన్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఇందులో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు కార్మికులు నిరసన, న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని నినాదాలు చేస్తూ భిక్షాటన చేశారు. రాష్ట్ర సిఐటియు నాయకత్వం సూచన మేరకు సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు.