రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి  మృతి

GDWL: గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ వెహికల్ పార్కింగ్ ప్రదేశంలో సోమవారం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే, వెంటనే గద్వాల్ టౌన్ ఎస్సై ఫోన్ నంబర్ 87126 70297‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.