విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

సత్యసాయి: చేన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో యువ రైతు సందీప్ (30) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. సోమవారం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో నీటి మోటార్ వద్ద విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.