అయ్యప్ప ఇరుముడి మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి
MHBD: కురవి మండల కేంద్రంలో బాదే నాగయ్య స్వామి, నాగరాజు స్వామి, నవీన్ స్వామి, గుంటి సురేష్ స్వామి బృందం నిర్వహించిన అయ్యప్ప ఇరుముడి మహోత్సవంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ముందుగా మణికంఠ అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 41 రోజుల కఠోర దీక్షతో శబరిమలకు బయలుదేరిన స్వాములకు అయ్యప్ప దయ కలగాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.