కలెక్టరేట్‌లో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

VSP: కలెక్టరేట్‌లో శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్ సారథ్యంలో అధికారులు, సిబ్బంది పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. ఆగస్టు నెల థీమ్ వర్షాకాలం పరిశుభ్రతకు కలెక్టరేట్ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను తొలగించటంతోపాటు, దోమలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపట్టారు.