VIDEO: గ్రామాల ప్రజలకు మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యే
KKD: పెద్దమల్లాపురం, శృంగధార గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు వెళ్లి ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను MLA వరుపుల సత్యప్రభ రాజా పరిశీలించారు. ఎవరికి ఏవిధమైన నష్టం వాటిల్లకుండా పులిని త్వరగా గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులను ఆమె ఆదేశించారు. రాత్రిపూట ప్రజలు ఎవరు బయటకు రావద్దని MLA ప్రజలకు సూచించారు.