'ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు'

అన్నమయ్య: ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. ఈ మేరకు సోమవారం మొలకలచెరువు వద్ద ఆటో యూనియన్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. సాంబశివ మాట్లాడుతూ.. ఈనెల 20న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.