సిద్దిపేట జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

SDPT: జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి సోమవారం తెలిపారు. భారీ వర్షాలతో వర్గల్, మర్కూక్, జగదేవపూర్, గజ్వేల్, కుకునూర్పల్లి, కొమురవెల్లి, మిరుదొడ్డి మండలాల్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు.