నేడు జిల్లాలో PGRS కార్యక్రమం
గుంటూరు జిల్లాలోని స్థానిక సమస్యలు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారం కోసం సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సిల్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో కలిసి నేరుగా అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.