'ప్రజావాణిలో దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలి'

KMR: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై 96 ఫిర్యాదులు వచ్చాయన్నారు.