నరసాపురం డీఎస్పీగా సుధాకర్ బాధ్యతలు

నరసాపురం డీఎస్పీగా సుధాకర్ బాధ్యతలు

W.G: నరసాపురం డీఎస్పీగా మేక సుధాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి విచ్చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని, చట్టవిరోధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.