గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి
VZM: బొబ్బిలి సబ్ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బీయస్‌వీ.ప్రసాద్ గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం గజపతినగరంలోని పురిటిపెంట న్యూ కాలనీలో ఆయన ఇంటిలో మృతి చెందారు. ఆయన గజపతినగరం, దత్తిరాజేరు ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేశారు. ప్రసాద్ మృతదేహానికి పలువురు నివాళి అర్పించారు.